మాజీ ఎమ్మార్వో నాగరాజు లాకర్లలో కిలోపావు బంగారం

మాజీ ఎమ్మార్వో నాగరాజు లాకర్లలో కిలోపావు బంగారం

హైదరాబాద్‌‌, వెలుగు: కీసర మాజీ తహసీల్దార్‌‌‌‌ నాగరాజు అవినీతి కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. బినామీల పేరుతో నాగరాజు భార్య స్వప్న ఆపరేట్ చేస్తున్న 2 లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. బంగారు నగలు, వెండి బిస్కెట్స్ స్వాధీనం చేసుకున్నారు. గురువారం అల్వాల్, మేడ్చల్ లోని ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఏసీబీ సోదాలు జరిపింది. నాగరాజు ఫ్రెండ్స్‌‌ పీజే మహేందర్‌‌‌‌కుమార్‌‌‌‌, పీజే నందగోపాల్‌‌ పేర్లతో ఉన్న లాకర్స్‌‌ ను గుర్తించింది. అల్వాల్‌‌లోని ఐసీసీఐ బ్యాంకులో పీజే మహేందర్‌‌‌‌ కుమార్ పేరుతో ఉన్న లాకర్‌‌‌‌లో రూ.65 లక్షల విలువైన 1.25 కిలోల బంగారు నగలు, మేడ్చల్‌‌ ఐసీఐసీఐ బ్యాంక్‌‌లోని మహేందర్‌‌‌‌కుమార్‌‌‌‌ తమ్ముడు నందగోపాల్‌‌ పేరుతో ఉన్న లాకర్‌‌‌‌లో రూ.4.5 లక్షల విలువైన 7.29 కిలోల వెండి బిస్కెట్స్‌‌ ను స్వాధీనం చేసుకుంది. కీసర రాంపల్లి దయారా ల్యాండ్‌‌ సెటిల్‌‌మెంట్‌‌లో రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీకి చిక్కారు. ఈ నెల 14న చంచల్ గూడ జైలులో నాగరాజు సూసైడ్ చేసుకున్నారు.

For More News..

‘సంగమేశ్వరం’పై ముందుకెళ్లొద్దు

నేను రాజీనామా చేస్త.. లేకపోతే నువ్వు చెయ్‌‌

పేషంట్లు రాక కరోనా బెడ్లు ఖాళీ