ఎఫ్‌టీఎక్స్‌ నుంచి కస్టమర్లకు చెందిన 8,200 కోట్లు మాయం

ఎఫ్‌టీఎక్స్‌ నుంచి కస్టమర్లకు చెందిన 8,200 కోట్లు మాయం

న్యూఢిల్లీ: తాజాగా దివాలా తీసిన క్రిప్టో ఎక్స్చేంజి ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎక్స్‌‌‌‌‌‌‌‌ నుంచి కస్టమర్లకు చెందిన కనీసం రూ.8,200 కోట్ల విలువైన ఫండ్స్‌‌‌‌‌‌‌‌ మాయమయ్యాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ ఎక్స్చేంజి ఫౌండర్ అయిన శామ్‌‌‌‌‌‌‌‌ బాంక్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌–ప్రైడ్‌‌‌‌‌‌‌‌ సీక్రెట్‌‌‌‌‌‌‌‌గా కస్టమర్లకు చెందిన 10 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్ల విలువైన ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎక్స్ నుంచి ఆయనకే చెందిన మరో ట్రేడింగ్ కంపెనీ అలమెడా రీసెర్చ్‌‌‌‌‌‌‌‌కు గతంలో పంపుకున్నారు.  ఈ అమౌంట్‌‌‌‌‌‌‌‌లో మెజార్టీ వాటా కనుమరుగయ్యిందని  రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఇందులో సుమారు 1.7 బిలియన్ డాలర్లు కనిపించడం లేదని కొందరంటే, మరికొందరు మాత్రం ఈ అమౌంట్ ఒకటి నుంచి రెండు బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు.  

ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎక్స్ కస్టమర్ల ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను అలమెడా రీసెర్చ్‌‌‌‌‌‌‌‌కు పంపిన విషయం తెలిసినప్పటికీ కస్టమర్ల ఫండ్స్ మిస్ అవ్వడం మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. బాంక్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌–ఫ్రైడ్ కిందటి ఆదివారం  సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లతో  ఫైనాన్షియల్ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌ను పంచుకున్నారు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే కస్టమర్ల ఫండ్స్ మిస్ అయినట్టు బయటపడిందని ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎక్స్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లు ఈ విషయాన్ని బయటపెట్టారు. కస్టమర్లు తమ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవడానికి ఎగబడడంతో  బహమాస్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎక్స్ శుక్రవారం అధికారికంగా దివాలా అయినట్టు ప్రకటించింది. బినాన్స్‌‌‌‌‌‌‌‌తో కుదుర్చుకున్న డీల్‌‌‌‌‌‌‌‌ కూడా  ఆగిపోవడంతో కంపెనీ దివాలా బాట పట్టింది.  ఈ కంపెనీ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెందిన 90 శాతం  సంపద ఒక్క రాత్రిలోనే తగ్గిన విషయం తెలిసిందే.