
కర్ణాటక:రూపాయికి నీళ్ల ప్యాకెట్ కూడా ఈ రోజుల్లో రాదు.. కానీ కర్ణాటకలోని హుబ్బళ్లి నగరంలో రూపాయికే రుచికరమైన భోజనం లిభిస్తుందంటే నమ్మగలరా.. నగరంలోని మహావీర్ వీధిలో ఒక్కరూపాయికే రుచికరమైన భోజనాన్ని మహావీర్ ఫౌండేషన్ ద్వారా నిర్వాహుకులు అందిస్తున్నారు. మహావీర్ ఫౌండేషన్ అనే ఈ సంస్థను దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభించారు. 1998లోనే మహావీర్ యువజన సమాఖ్య ఏర్పడింది. దీని ద్వారా అప్పటి నుంచే పలు సేవాకార్యక్రమాలు కూడా వారు చేస్తున్నారు. ఓ జైన గురువు సలహామేరకు 2009లో ఇక్కడ రోటీఘర్ ను ప్రారంభించారు. ఈ రోటీఘర్ లో ఒక్కరూపాయికే రుచికరమైన భోజనం దొరుకుతోంది.