వారం రోజుల్లో నవంబర్ నెల వచ్చేస్తుంది. అంటే శీతాకాలం వచ్చేసినట్లే ఈ కాలం వచ్చింది. అంటే ఉదయాన్నే చలికి నిద్ర లేవాలనిపించదు. ఇంకొద్ది సేపు బద్ధకంగా పడుకోవాలనిపిస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే వేధిస్తాయి. జీర్ణశక్తి తగ్గుతుంది. ఆకలి మందగిస్తుంది.కాబట్టి చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిడని చెప్తున్నారు వైద్యులు. ఉదయం రాత్రి అన్నం తిన్నాక యాపిల్, దానిమ్మలాంటి ఏదో ఒక పండు తినడం మంచిది.
అలాగే ఆహారాన్ని బాగా నమిలి తింటే తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఒక్కోసారి ఎంత తిన్నా మళ్ళీ ఆటలేస్తూనే ఉంటుంది. ప్రతిపాద్ భోజనం తినేకంటే స్నాక్స్ లాంటివి తీసుకోవచ్చు. వేడి కాఫీలు, టీలు ఎక్కువ తాగాలనిపిస్తుంది. అలాగని మోతాదు మించకూడదు. రాత్రి పూట పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే మంచిది.
పెరుగుకన్నా మజ్జిగ తీసుకోవటం వల్ల కడుపులో సమస్యలు తలెత్తవు. జలుబు, దగ్గు జ్వరం లాంటి చిన్నచిన్న అనారోగ్యాలు వస్తే ఆలస్యం వేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ఇక సైనస్ సమస్య ఉన్న వాళ్లు చలికాలంలో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్లు డాక్టర్ సలహాను బట్టి నడుచుకుంటే సరిపోతుంది.. పిల్లలు, పెద్దవాళ్లు చలిని తట్టుకోదానికి ఉన్ని దుస్తులు ధరించినా, మంచులో తిరగకూడదు.
