రాజస్థాన్లో మరో ట్రక్కు డ్రైవర్.. 10 మంది ప్రాణాలను తీసిండు.. 17 వాహనాలను ఢీకొట్టి.. కారును 5 కీ.మీ. ఈడ్చుకెళ్లిండు

రాజస్థాన్లో మరో ట్రక్కు డ్రైవర్.. 10 మంది ప్రాణాలను తీసిండు.. 17 వాహనాలను ఢీకొట్టి.. కారును 5 కీ.మీ. ఈడ్చుకెళ్లిండు

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 21 మంది చనిపోయిన ఘటన మరువక ముందే.. రాజస్థాన్ లో మరో ట్రక్కు డ్రైవర్ 10 మంది ప్రాణాలను బలిగొన్నాడు. సోమవారం (నవంబర్ 03) మధ్యాహ్నం 17 వాహనాలను ఢీకొట్టడమే కాకుండా.. కారును 5 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లి విధ్వంసం సృష్టించాడు. 

ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది చనిపోగా.. 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. హర్మద పోలీస్ స్టేషన్ పరిధిలో.. లొహమండి రోడ్డు పై వెళ్తున్న ట్రక్కు కంట్రోల్ తప్పడంతో కార్లు, బైకులను వరుసగా ఢీకొంటూ పెద్ద విధ్వంసమే సృష్టించింది. 

డ్రైవర్ తాగిన మైకంలోనే ఈ ప్రమాదానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడని స్థానికులు చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రోడ్ నెం.14 నుంచి వస్తున్న ట్రక్కు.. హైవే పైకి ఎంటరయ్యే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

జైపూర్ లో ఆదివారం (నవంబర్0) జరిగిన ఘోర ప్రమాదాన్ని మరువక ముందే.. సోమవారం మరో యాక్సిడెంట్ జరగడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న (ఆదివారం ) జరిగిన ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఉదయం ఆగి ఉన్న ట్రైలర్ ట్రక్కును ఓ బస్సు ఢీకొట్టడంతో 18 మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని జైపూర్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్హోడి జిల్లా మటోడా గ్రామం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బాధితులను జోధ్  పూర్ లోని సుర్ సాగర్  ఏరియాకు చెందినవారుగా గుర్తించారు.