- ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 10 నమోదు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ఉల్లంఘనపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు10 కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు భంగం కలిగించినా, ఓటర్లను ప్రలోభపెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కించపరిచే పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మామిడాల దశరథ్, నిమ్మల రవీందర్ రెడ్డి, అరవింద్ కుమార్, రాహుల్ రెడ్డిలను, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ఆడేపు రవిని వన్టౌన్పోలీసులు అరెస్ట్చేశారన్నారు.
ఓటర్లకు పంచేందుకు మద్యం నిల్వ ఉంచిన నలవల సుమ, జక్కుల సచిన్ వద్ద15.6 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు తెలిపారు. బైక్ పై మద్యం తరలిస్తున్న భూపతి వెంకటేశ్, గంటికళ్ల ముఖేశ్పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పటాకులు పేల్చిన కౌన్సిలర్ అభ్యర్థి షాహిత షేక్ సహా ఆరుగురిపై, ఓటర్లకు మత గ్రంథాలను పంపిణీ చేసిన అభ్యర్థి బొంపల్లి హనుమాన్లుపై కేసు నమోదు చేశామని చెప్పారు.
