ఇమ్యూనిటీని పెంచే హెల్దీ డ్రింక్స్ ఏవో తెలుసా

ఇమ్యూనిటీని పెంచే హెల్దీ డ్రింక్స్ ఏవో తెలుసా

బాగా అలసిపోయినప్పుడు కూల్డ్రింక్ తాగితే ఎంతో ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఆ ఎనర్జీ ఎంతసేపు ఉంటుంది? కాసేపటికి మళ్లీ గొంతు తడారిపోయి దాహం వేస్తుంది. ఎనర్జీ కూడా ఆవిరైపోతుంది. అప్పుడు మళ్లీ కొనుక్కొని తాగాల్సిందే. కూల్డ్రింక్స్ కంపెనీలు కోరుకునేది కూడా అదే. అంతేకాదు మార్కెట్లో దొరికే ఈ కూల్ డ్రింక్స్తో సైడ్ ఎఫెక్స్ ట్ కూడా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా వేసవి సమస్యలు తీరుస్తూ ఇమ్యూనిటీని పెంచే హెల్దీ డ్రింక్స్ ఏవో తెలుసా?

దానిమ్మ జ్యూస్

ఇమ్యూనిటీని పెంచడంలో దానిమ్మది ప్రత్యేక స్థానమ నే చెప్పాలి. ఎందుకంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళకు్ల , షుగర్, బీపీ, ఆస్తమా పేషెంట్లకు కరోనా ముప్పు ఎక్కువ గా ఉందని డాకర్్ట లుచెబుతున్నారు. ఇలాంటివారికి ఇమ్యూనిటీ పెరగడంతోపాటు షుగర్ , బీపీ, ఆస్తమా, హార్ట్ఎటాక్ముప్పును తగ్గించడంలో దానిమ్మ జ్యూస్ మెడిసిన్లా పనిచేస్తుంది. అంతేకాదు ప్రొస్టేట్ క్యాన్సర్, ఉపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యతిరేకం గా పోరాడుతుంది. జీర్ణసమస్యల్ని తగ్గిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ నుంచి రిలీఫ్‌ ఇస్తుంది. అన్నింటికీ మించి రక్తహీనత సమస్య ఉన్నవాళ్లురోజూ దానిమ్మ జ్యూస్ తాగితే త్వరగా ఆ సమస్య నుంచి బయటపడతారు. వేసవిలో దాహాన్ని తగిం్గ చడానికి కూడా దానిమ్మ జ్యూస్ మంచి రెమెడీ.

 గ్రీన్ టీ

గ్రీన్ టీ తాగడం వల్ల హెల్త్బెనిఫిట్స్‌ ఉన్నాయి. గ్రీన్ టీ శరీరంలో రెసిస్టె న్స్‌ పవర్పెంచుతుంది. జీవక్రియ ల్ని వేగవంతం చేస్తుంది. వేసవిలో చర్మాన్నియూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూగ్రీన్‌ టీ తాగడంవల్ల గుండె జబ్బుల నుండి బయటపడొచ్చు. శరీరంలోని చెడు కొలెస్టరాల్ను పూర్తిగా తొలగిస్తుంది. గ్రీన్‌ టీలో తక్కువ కేలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలి అను కునేవారు ఈ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. వయసు పెరుగుదల ప్రభావం చర్మంపై ఉంటుంది. ముఖ్యంగా దాహాన్ని తగ్గిసగ్గి ్తుంది. రోజూఒక కప్పు గ్రీన్ టీ తాగడం మంచిది.

అల్లం టీ

అల్లంలో విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లం తోనే టీ చేసుకుని తాగడం వల్ల మంచి ప్రయోజనా లున్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. కండరాల నొప్పుల్ని, వాపును తగ్గిసగ్గి ్తుంది. వర్కవుట్స్ తర్వాత అల్లం చాయ్ తాగితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. అజీర్తిని తగ్గిసగ్గి ్తుంది. అయితే సమ్మర్లో టీ ఎక్కువగా తాగలేం. కాబట్టి తేనె కలుపుకొని జ్యూస్ చేసుకొని తాగాలి. దీనివల్ల కూడా అల్లం ఆరోగ్య ప్రయోజనా లన్నీ అందుతాయి.

 హాట్ చాక్లెట్

యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లతో పాటు కాల్షియం పుష్కలంగా ఉండే డ్రింక్ ఇది. అయితే చాలా మందికి ఈ డ్రింక్ గురించి తెలియదు. ఇటీవల నిర్వహించిన ఓ రిసెర్చ్ లో  డ్రింక్ లో హాట్ చాక్లెట్  డ్రింక్ ఉంది. దీన్ని తయారుచేసుకోవ డం పెద్దకష్టమేమీ కాదు. ఒకగ్లాసు వేడినీళ్లల్లో ఒక టీ స్పూన్  కోకో పౌడర్ లేదంటే డార్క్ చాక్లెట్ పౌడర్ వేసుకొని, తగినంత షుగర్ కలిపితే చాలు. అయితే దీన్ని రోజుకు ఒక కప్పుకు మించి తాగొద్దని డాక్టర్లు చెబుతున్నారు.

 నిమ్మరసం

కరోనా కలకలం మొదలైనప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట.. విటమిన్–సి ఎక్కువగా ఉన్ననిమ్మరసం తాగాలని. టీ తాగడం అలవాటు లేని వాళ్లు లెమన్ టీ తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నిమ్మరసం తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాక లివర్ ఆరోగ్యంగా మారుతుంది.

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్లో విటమిన్– సి, విటమిన్–ఎ, క్యాల్షియం, విటమిన్–బి6, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. నేరుగా తిన్నా , జ్యూస్ తాగినా ఒకరకమైన ఫలితం ఉంటుంది. గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.  ఇమ్యూ నిటీ పెంచుతుంది. పెద్ద పేగును శుభ్ర పర్చడంతో పాటు పేగులో పుండ్లు ఉంటే కూడా తగ్గిస్తుంది. తినే అరగంట ముందు ఆరెంజ్ జ్యూస్ తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వాళ్లు తక్కువగా తినేందుకు ఆరెంజ్ జ్యూస్ సాయపడుతుంది. బీట్ రూట్ జ్యూస్ బీట్రూట్లో చాలా పోషకాలుంటాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు బీట్రూట్  తాగితే చాలా మంచిది. బీట్రూట్ జ్యూస్ బీపీని తగ్గించడమే కాక, పెద్దవాళ్లల్లో మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. బీట్రూట్ జ్యూస్లో క్యాల్ షియం, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. వాటర్ టైం టేబుల్ పొద్దున లేవ గానే, టిఫిన్ చేయడానికి అరగంట ముందు, భోజనానికి అరగంట ముందు తప్పనిసరి గా నీళ్లుతాగాలి. అలాగే టిఫిన్, లంచ్  మధ్యలో ఒకసారి, లంచ్ కు  అరగంట ముందు మళ్లీ నీళ్లు తాగాలి. సాయంత్రం ఒకసారి,డిన్నర్ కు  అరగంట ముందు మరోసారి నీళ్లు తాగాలి. ఇది నీళకు్ల సంబంధిం చి టైంటేబుల్. అయితే కొన్నిసార్లుఎక్కువ నీళ్లుతాగాల్సి వస్తుంది. ఫిజికల్ యాక్విటీస్ టి ఎక్కువై నప్పుడు, ఎండాకాలం బయటకు వెళ్నప్పుడు, లి కొన్ని రకాల వాతావరణ పరిస్థితుల వల్లనీళ్లుఎక్కువగా తాగాల్సిరావొచ్చు. అప్పుడు మన శరీరమే ఇండికేషన్ ఇస్తుంది. దానిని గమనించి టైంటేబుల్తో సంబంధం లేకుండా నీళ్లు తాగాలి.

నేచురల్ మెడిసిన్

నీళ్లను న్యాచరుల్ చెబుతుంటారు. అందుకు కారణం.. శరీరానికి సరిపడా నీళ్లుతాగుతూ ఉంటే ఏ రోగాలూ రావట. దాదాపు 80 శాతం రోగాలకు సరిపడా నీళ్లుతాగకపోవడమే కారణమంటారు డాక్టర్లు. నీళ్లు శరీరానికి  అవసరమైన పోషకాలతోపాటు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను ఎప్పటికప్పుడు బయటకు పంపేస్తాయి.