బీర్ లవర్స్ తప్పక ట్రై చేయాల్సిన ఇండియన్ బ్రాండ్స్ ఇవే

బీర్ లవర్స్ తప్పక ట్రై చేయాల్సిన ఇండియన్ బ్రాండ్స్ ఇవే

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని సార్లు మితంగా తీసుకునే ఆల్కహాల్ కంటెంట్ కూడా శరీరానికి మేలే చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలా అని ఏదో ఒక బ్రాండ్ తాగితే మాత్రం ఆరోగ్యం నిజంగానే పాడవుతుంది. బాధొచ్చినా, సంతోషమొచ్చినా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే, తీసుకునే పానీయాల్లో బీరు కూడా ఒకటి. వీటిలో బీర్ ప్రేమికులు తప్పక ట్రై చేయాల్సిన మన ఇండియన్ బీర్ బ్రాండ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కింగ్ ఫిషర్

దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన, సులభంగా లభించే బీర్లలో కింగ్ ఫిషర్ ఒకటి. దీన్ని బెంగళూరులోని యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ ఉత్పత్తి చేస్తుంది.

సింబా

ఇది 2016లో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. మాల్ట్, హాప్స్ ఎక్స్ ట్రాక్ట్ తో ఇది మిళితమై ఉంటుంది. భారీ డిమాండ్ లో దిగుమతి అవుతోన్న సింబా.. కారామెల్ చాక్లెట్ ఫ్లేవర్ ను కలిగి ఉండడం దీని ప్రత్యేకత.

కింగ్స్

మీరు ప్రస్తుతం గోవాలో ఉన్నట్టయితే, లేదా ఎప్పుడైనా వెళ్తే.. అక్కడ తయారు చేసే బీర్ .. కింగ్స్ ను తప్పనిసరిగా రుచి చూడాల్సిందే అంటున్నారు బీర్ ప్రియులు. 2015వరకు ఇది బీచ్ లో స్పెషల్ గా అందుబాటులో ఉండేది.

నాకౌట్

తెలంగాణ, మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో నాకౌట్ ఎంతో ప్రసిద్ది చెందింది. దీని వాసనకు కూడా ఎంతో ప్రసిద్ది చెందింది.

బీరా 91

బీరా 91 అనేది ఇండియన్ క్రాప్ట్ బీర్ బ్రాండ్. దీన్ని 2015లో బీ 9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించింది. ఇది బెల్జియంలోని ఓ ప్లాన్డర్స్ ప్రాంతంలో తయారై.. దేశానికి దిగుమతి అవుతుంది.

గాడ్ ఫాధర్

దేవన్స్ మోడరన్ బ్రూవరీస్ లిమిటెడ్ గాడ్ ఫాధర్ బ్రాండ్ ను తీసుకువచ్చింది. 1961లో జమ్మూలో దీని ఉత్పత్తిని ప్రారంభించింది.

హేవర్డ్స్ 5000

1974లో ప్రవేశపెట్టిన ఈ హేవర్డ్స్ 5000.. ఇప్పటికీ ప్రజాదరణను పొందుతూనే ఉంది. దీని ఫ్లేవర్, సువాసన.. బ్రాండ్ కు మారుపేరుగా మారాయి.

థండర్ బోల్ట్

థండర్ బోల్ట్ రుచి చేదుగా ఉంది. ఇది అధిక ఆల్కహాల్ కంటెంట్ కు ప్రసిద్ధి చెందింది. ఇది 1980లో ప్రవేశపెట్టబడిన స్ట్రాంగ్ బీర్లలో ఒకటిగా చెప్పవచ్చు.

బ్రో కోడ్

బ్రో కోడ్ తయారీ యూనిట్ గోవాలో ఉంది. ఈ బ్రాండ్ 2018లో బీర్ ఔత్సాహికులకు పరిచయమైంది. ఇది కూడా అధిక ఆల్కహాల్ కంటెంట్ కు ప్రసిద్ధి చెందింది.