రంగారెడ్డి, వెలుగు: వాటర్ బాటిల్లో ఈగ వచ్చిందని, తనకు రూ.10 లక్షలకు ఇవ్వకపోతే అన్ని చానల్స్‌లో పబ్లిష్ చేయిస్తానని సదరు కంపెనీ యజమానిని బెదిరిం చిన వ్యక్తిపై కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు.. రాగన్నగూడ ఓం గణేశ్ నగర్‌కి చెందిన తవిటి కృష్ణ చింతపల్లిగూడలో దాసరి స్ప్రింగ్స్ (బిస్లెరీ వాటర్ బాటి ల్) కంపెనీలో పని చేస్తున్నాడు.
సోమవారం ఆయనకు సై(SYE) యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ ను అంటూ కీసరకు చెందిన సురేందర్ రెడ్డి ఫోన్ చేశాడు. తాను ఒక హోటల్లో భోజనం చేస్తుండగా బిస్లెరీ వాటర్ బాటిల్ కొన్నానని, అందులో ఈగ వచ్చిందని చెప్పాడు. ఇది బయట పడకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని పదే పదే ఫోన్ చేస్తూ బెదిరిం చడంతో కృష్ణ ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.