గాలిపటం కోసం పరిగెడుతూ..పెంటకుప్పలో పడి బాలుడి మృతి

గాలిపటం కోసం పరిగెడుతూ..పెంటకుప్పలో పడి బాలుడి మృతి

ముంబై: గాలిపటం కోసం పరిగెడుతూ.. ఆవులు, గేదెల పెంటకుప్పలో పడి పదేళ్ల బాలుడు చనిపోయాడు. పశ్చిమ ముంబై శివారలోని కండివాలిలో గురువారం నాడు జరిగిన ఘటన పండుగ సందర్భంగా విషాదం మిగిల్చింది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు అందరూ గాలిపటాలు ఎగరేయడం ఆనవాయితీ. పండుగకు కొద్ది రోజుల ముందు నుండే గాలిపటాల సందడి మొదలై.. పండుగ వెళ్లిన తర్వాత కూడా కొద్ది రోజులపాటు ఉంటుంది. నిన్న సంక్రాంతి పండుగ సందర్భంగా పదేళ్ల బాలుడు ఉదయం నుండి గాలిపటంతోనే ఆడుకుంటూ గడిపాడు. మధ్యాహ్నం సమయంలో తన గాలిపటం ఎస్.ఆర్.ఏ కాలనీలోని ఓ భవంతి పక్కన ఉన్న గోవులు, గేదెల షెడ్డుపై పడిపోవడంతో దాన్ని అందుకునేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే పేడ కోసం తీసిన గొయ్యి పెద్దగా ఉన్నా ఆ బాలుడు పట్టించుకోలేదు. అందేంత ఎత్తులో కనిపించిన గాలిపటం కోసం ఎగిరి దూకడంతో పచ్చిగా ఉన్న పేడ కుప్పలో పడి కూరుకుపోయాడు. వెంటనే భయంతో కేకలు వేశాడు. పక్కనే ఉన్న ఓ భారీ భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు గుర్తించి పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే పేడ పచ్చిగా ఉండడంతో తాము కూడా అందులో కూరుకుపోతామని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కూడా వెంటనే ఫైర్ సిబ్బందిని పిలిపించి వారి వద్ద ఉన్న భారీ క్రేన్ సహాయంతో పేడ కుప్పలో కూరుకుపోయిన బాలుడ్ని బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రికి రాకముందే ఊపిరాడక చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై కందివాలి పోలీసులు కేసు నమోదు చేశారు. అవసరమైతే పెంట కుప్ప యజమానిపై జనావాసాల మధ్య నిర్లక్ష్యంగా పెంట కుప్ప పెట్టి ప్రమాదానికి కారణమైనట్లు కేసు నమోదు చేయడాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించారు.

for more news..

రేపే వ్యాక్సినేషన్ షురూ.. ఎవరు వేసుకోవచ్చు? ఎవరు వేసుకోకూడదు?

మొక్కను దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు.. ఇద్దరి అరెస్ట్

డిప్యూటెషన్ పై మనస్థాపం: MPDO ఆత్మహత్యాయత్నం