
బిహార్ ముజఫర్ పూర్ లో మెదడువాపు కారణంగా చనిపోయిన చిన్నారుల సంఖ్య వందకు చేరింది. మరో 300 మంది వరకు చిన్నారులు వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఒక్క శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ లోనే 83 మంది చిన్నారులు చనిపోయారు. బిహార్ ఆరోగ్యమంత్రి మంగళ్ పాండే.. హాస్పిటల్స్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.
బిహార్ లో మెదడువాపు వ్యాధితో పెద్ద సంఖ్యలో చిన్నారులు చనిపోవడంపై స్పందించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. సిండ్రోమ్ వ్యాప్తికి కారణాలపై ఆరా తీస్తున్నామన్నారు. మెదడు వాపు వ్యాధి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే తమ టీంలు పనిచేస్తున్నాయని చెప్పారు. గతంలోనే.. ప్రభావిత ప్రాంతాల్లో ప్రివెంటీవ్ మెడిసిన్ ఎప్పటికప్పుడు పంపిణీ చేశామన్నారు. అయినా వ్యాధి ప్రబలడంపై ఎంక్వైరీ చేస్తున్నట్టు చెప్పారు.