వాడీవేడిగా గద్వాల జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..అక్రమ మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూ. 100 కోట్ల నష్టం

వాడీవేడిగా గద్వాల జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..అక్రమ మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూ. 100 కోట్ల నష్టం
  •       కరెంట్‌‌‌‌‌‌‌‌, మిషన్ భగీరథ నీళ్లు బంద్ చేసి  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బద్నాం చేసే కుట్ర 
  •       రైస్ మిల్లర్ల నుంచి రూ. 17 కోట్లు ఎలా రాబడతారు
  •        సమావేశానికి- గద్వాల నియోజకవర్గ నలుగురు జడ్పీటీసీలు దూరం 

గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమ మైనింగ్ ఆపకపోతే జిల్లాకు రూ. 100 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని జడ్పీటీసీలు, ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గద్వాలలో జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిత అధ్యక్షతన మీటింగ్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఏడీ విజయరామరాజు మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్చను ప్రారంభించి మాట్లాడుతుండగా..  కొంతమంది జడ్పీటీసీలు జోక్యం చేసుకుని భారత్ మాల కింద రోడ్లు వేసే సమయంలో మేఘా కంపెనీ అక్రమ మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  పాల్పడినా ఎందుకు అడ్డుకోలేరని అడిగారు.

స్పందించిన ఏడీ ఏడాదిన్నర క్రితమే అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు గుర్తించి రూ. 52 కోట్ల 25 లక్షలను మేఘా కంపెనీకి ఫైన్ వేశామని తెలిపారు.  దీనిపై వారు ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారని చెప్పారు.  ఈ విషయంలో తనపై కూడా ఎంక్వైరీ జరిగిందని పేర్కొన్నారు.  

17  కోట్లు రికవరీ ఎట్లా చేస్తారు..?

సివిల్ సప్లై పై సమీక్షలో సీఎంఆర్ వడ్ల కుంభకోణంలో బకాయి పడ్డ  రైస్ మిల్లర్ల నుంచి రూ. 17  కోట్ల రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా రికవరీ చేస్తారని వడ్డేపల్లి జడ్పీటీసీ రాజు ప్రశ్నించారు.  ఉద్దేశ పూర్వకంగా మిల్లుల్ని లీజుకు తీసుకొని అమాయకులను బలి చేస్తున్నారని ఆరోపించారు.  వాళ్ల ఆస్తులు అమ్మినా కూడా ఆ డబ్బు రాదని తేల్చి చెప్పారు.  కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారే తప్పా..  ఇప్పటివరకు ఒక్క రూపాయి వసూలు చేయలేదని జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసహనం వ్యక్తం చేశారు.

 దీనిపై సివిల్ సప్లై డీఎం విమల,  డీఎస్ఓ రేవతి మాట్లాడుతూ..  ఆర్ఆర్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తహసీల్దార్లకు లెటర్లు రాశామని, ఆస్తులు అమ్మినావారి డబ్బులు రానిపక్షంలో సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. మరింత ఆలస్యం చేస్తే అక్రమదారులకు సపోర్ట్ చేసినట్లవుతుందని వారిపై త్వరగా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.

కాంగ్రెస్ సర్కారును బద్నాం చేసే కుట్ర

విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖలో గ్రామాల్లోని కొంతమంది ఎంప్లాయిస్ కరెంటును కావాలని కట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సరిగా రావడం లేదని ప్రజలకు చెబుతున్నారని ఆరోపించారు.  మిషన్ భగీరథ నీళ్లు సరిగా సరఫరా చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి  చేసే కుట్రలు చేస్తున్నారని జడ్పీ  చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిత మండిపడ్డారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.  రాజోలిలో 15  కరెంట్ పోల్స్ కావాలని కొన్ని నెలల నుంచి అడుగుతున్నా ఇవ్వడం లేదని జడ్పీటీసీ వాపోయారు.  

శెట్టి ఆత్మకూరు, పాగుంటలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్ లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు.  కురువపల్లిలో ఇండ్లపై నుంచి పోతున్న కరెంటు లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మార్చాలని జడ్పీ చైర్మన్ ఆఫీసర్లను కోరారు.

పనులు చేయకుండానే బిల్లులు దండుకున్నారు

పంచాయతీరాజ్ శాఖ  సమీక్షలో  గద్వాల టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈద్గా పనులు పూర్తి కాకుండానే బిల్లును తీసుకున్నారని జడ్పీ చైర్ పర్సన్‌‌‌‌‌‌‌‌ సరిత ఆఫీసర్లను ప్రశ్నించారు.  పంచాయతీరాజ్ ఈఈ మాట్లాడుతూ..  కొన్ని పనులు ఎస్టిమేషన్  కన్నా అదనంగా బిల్లు అయ్యాయని అన్ని వివరాలు సాయంత్రంలోగా సమర్పిస్తానని తెలిపారు.  ఎక్సైజ్ పై చర్చలో ఇల్లీగల్ కల్లు షాపులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు రైతు బంధు ఎప్పుడు పడుతుందని..  రైతు బీమా ఎన్ని రోజులు కొనసాగుతుందని సభ్యులు అగ్రికల్చర్ ఆఫీసర్లను ప్రశ్నించారు.  రెండు ఎకరాల వారికి డబ్బులు పడ్డాయని వచ్చే ఆగస్టు వరకు రైతు బీమా ఉంటుందని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గోవింద్ నాయక్ తెలిపారు.  

జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గద్వాల నియోజకవర్గంలోని అయిదు మంది జడ్పీటీసీల్లో కేవలం కేటి దొడ్డి మండలం జడ్పీటీసీ మాత్రమే హాజరయ్యారు.  మిగతా నలుగురు జడ్పీటీసీలు డుమ్మా కొట్టారు.  ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. అలంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్పీటీసీలు ఎక్కువ హాజరు కావడంతో కోరం సరిపోయింది.  జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిత పార్టీ మారడంతో  బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన నలుగురు జడ్పీటీసీలు హాజరు కాలేదనే చర్చ జరుగుతుంది.  వివిధ మండలాల జడ్పీటీసీలు..  ఎంపీపీలు, జిల్లా ఆఫీసర్లు, జడ్పీసీఓ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండానే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్  చేసిండ్రు 

హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్చ జరుగుతుండగా అలంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ..  అలంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   100  బెడ్స్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు సిబ్బందిని ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు.  హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు మాట్లాడుతూ.. ఇంకా అలంపూర్ 100 బెడ్స్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగలేదని సమాధానం ఇచ్చారు.  హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వాటర్ సప్లై లేకున్నప్పటికీ ఓపెన్  చేయడం తగదని ఇంకా కాంపౌండ్ వాల్ నిర్మాణం ఒక వైపు కంప్లీట్ కాలేదన్నారు.  ఇన్ని పనులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పటికీ ఎన్నికల ముందు దీన్ని ఓపెన్ చేశారని విమర్శించారు.  పల్లె దవాఖాన ఆసుపత్రులు ఎప్పుడూ మూసి ఉంటున్నాయని ఆరోపించారు.