ఎమ్మెల్యే బర్త్ డే.. వెయ్యి మంది రక్తదానం

ఎమ్మెల్యే బర్త్ డే.. వెయ్యి మంది రక్తదానం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బర్త్ డే సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో వెయ్యి మందికిపైగా బ్లడ్ డొనేషన్ చేశారు. గతేడాది 750 మందికి పైగా రక్తదానం చేసి రికార్డు సృష్టించగా.. ఈ రికార్డును బద్దలు కొడుతూ 1035 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

రక్తదాన శిబిరంలో డీఎంహెచ్​వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, వైద్యులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే  కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.