టెన్త్ క్లాస్ రోజుల్ని గుర్తు చేసుకున్న అవికా

V6 Velugu Posted on Jan 27, 2022

టెన్త్ క్లాస్ డేస్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని రోజులు.  ఆ ఏజ్‌‌లో అందరూ స్కూల్‌‌లో ఉంటే తాను మాత్రం షూటింగ్‌‌ని ఎంజాయ్ చేశానంటోంది అవికాగోర్. పదో తరగతి చదివేటప్పుడే ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్‌‌గా పరిచయమవడంతో టెన్త్​ క్లాస్​ తన జీవితంలో ఎంతో స్పెషల్‌‌ అని చెప్పింది. శ్రీరామ్‌‌తో కలిసి ఆమె నటించిన ‘టెన్త్ క్లాస్‌‌ డైరీస్‌‌’ టీజర్‌‌‌‌ లాంచ్‌‌లో అవికా తన స్కూల్ డేస్​ను గుర్తుచేసుకుంది. తన కెరీర్‌‌‌‌లో ఇప్పటివరకూ నటించని డిఫరెంట్‌‌ క్యారెక్టర్‌‌‌‌ను ఇందులో పోషించానంది అవికా. కెమెరామేన్‌‌ ‘గరుడవేగ’ అంజి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అచ్యుత రామారావు నిర్మించారు. టీజర్‌‌ లాంచ్‌‌కు నిర్మాత సి.కళ్యాణ్, కెమెరామేన్ చోటా కె నాయుడు, రైటర్ బివిఎస్‌‌ రవి ముఖ్య అతిథులుగా హాజరై సినిమా సక్సెస్‌‌ సాధించాలని విష్​ చేశారు. టెన్త్ క్లాస్‌‌ మేట్స్ రీ యూనియన్‌‌ కాన్సెప్ట్‌‌తో, ఆ మెమొరీస్‌‌ను గుర్తుచేసేలా తీసిన ఈ మూవీని మార్చి 4న రిలీజ్‌‌ చేస్తున్నామన్నారు నిర్మాత. నటీనటులంతా అద్భుతంగా నటించారని ముఖ్యంగా క్లైమాక్స్‌‌ సీన్స్‌‌లో అవికా గోర్ నటన  కన్నీళ్లు పెట్టిస్తుందన్నాడు దర్శకుడు అంజి. ఇంకా ఈ కార్యక్రమంలో కమెడియన్ శ్రీనివాసరెడ్డి, హిమజ, సంగీత దర్శకుడు చిన్నా, ఎడిటర్ ప్రవీణ్‌‌ పూడి పాల్గొన్నారు.

Tagged Avika Gor, 10th Class Diaries teaser, 10th Class Diaries movie

Latest Videos

Subscribe Now

More News