టెన్త్ ఎగ్జామ్స్ ర‌ద్దు.. ఆల్ పాస్: తెలంగాణ‌, త‌మిళ‌నాడు బాట‌లో మ‌రో సీఎం ప్ర‌క‌ట‌న‌

టెన్త్ ఎగ్జామ్స్ ర‌ద్దు.. ఆల్ పాస్: తెలంగాణ‌, త‌మిళ‌నాడు బాట‌లో మ‌రో సీఎం ప్ర‌క‌ట‌న‌

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో టెన్స్ క్లాస్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌న్న‌ నిర్ణ‌యం తీసుకున్న‌‌ తెలంగాణ ప్ర‌భుత్వ బాట‌లోనే మ‌రికొన్ని రాష్ట్రాలూ ప‌య‌నిస్తున్నాయి. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా 10, 11 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు బోర్డు ఎగ్జామ్స్ ర‌ద్దు చేస్తూ ఈ రోజు నిర్ణ‌యం తీసుకుంది. క్వార్ట‌ర్లీ, హాఫ్ ఇయ‌ర్లీ ప‌రీక్ష‌ల నుంచి 80 శాతం, అటెండెన్స్ ను బ‌ట్టి 20 శాతం మార్కుల వెయిటేజీ ఇచ్చి పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేయ‌బోతున్న‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి ప్ర‌క‌టించారు.

పుదుచ్చేరిలోనూ నో ఎగ్జామ్స్..

తెలంగాణ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల త‌ర‌హాలో కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరి సీఎం వి.నారాయ‌ణ స్వామి నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా క్రైసిస్ నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు మంగ‌ళ‌వారం ఆయ‌న ప్ర‌క‌ట‌న చేశారు. బోర్డు ఎగ్జామ్స్ లేకుండానే అంద‌రినీ పాస్ చేసి పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. పుదుచ్చేరిలో ఎక్కువ భాగం విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన వారేన‌ని, స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్న‌వారి సంఖ్య చాలా త‌క్కువ అని అందువ‌ల్ల ఆన్ లైన్ క్లాసుల నిర్వ‌హ‌ణ కూడా కుద‌ర‌డం లేద‌ని ఆయ‌న చెప్పారు.

త‌మిళ‌నాడులో ఇప్ప‌టి వ‌ర‌కు 33 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. అందులో 286 మంది మ‌ర‌ణించ‌గా.. 17,527 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పుదుచ్చేరిలో మొత్తం 127 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. 52 మంది పూ‌ర్తిగా కోలుకుని ఆస్ప‌త్రి నుంచి క్షేమంగా ఇంటికి చేరారు. ప్ర‌స్తుతం 75 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. అక్క‌డ క‌రోనా కార‌ణంగా ఒక్క మ‌ర‌ణం కూడా న‌మోదు కాక‌పోవ‌డం ఊర‌ట‌నిస్తోంది.