ఆగిఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 11మంది మృతి

ఆగిఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 11మంది మృతి

ఉత్తర్ ప్రదేశ్ లో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా... మరో 10 మందికి గాయాలయ్యాయి. బాధితులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తారు డాక్టర్లు.  షాజహన్ పుర్  జిల్లాలోని ఖుతర్  దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

షాజహాన్‌పూర్ ఎస్పీ అశోక్ కుమార్ మీనా మాట్లాడుతూ.. రాత్రి 11:00 గంటల ప్రాంతంలో ఖుతార్ పీఎస్ పరిధిలో బస్సు ఆగి ఉందని, పూర్ణగిరికి వెళ్లే భక్తులు బస్సులో కూర్చొని కొందరు భక్తులు భోజనం చేస్తుండగా  ఒక ట్రక్కు అదుపు తప్పి బస్సుపైకి దూసుకెళ్లిందన్నారు, ఇందులో మొత్తం 11 మంది మరణించారు మరియు 10 మంది గాయపడ్డారని వెల్లడించారు.