పెద్దమందడి మండలంలో 11 అడుగులు కొండచిలువ పట్టివేత

పెద్దమందడి మండలంలో 11 అడుగులు కొండచిలువ పట్టివేత

పెద్దమందడి, వెలుగు: మండలంలోని మోజెర్ల గ్రామ శివారులోని శంకర్  సముద్రం రిజర్వాయర్  ప్యాకేజీ–19 కెనాల్​ వద్ద శుక్రవారం 11 అడుగులు కొండచిలువను పట్టుకున్నారు. నాలుగు రోజులుగా బ్రిడ్జి రిపేర్​ పనులు చేస్తున్న కూలీలు కొండచిలువను గుర్తించి ఇరిగేషన్  ఏఈ రమేశ్, కాంట్రాక్టర్  ధనుంజయ్ కు చెప్పారు. సాగర్  స్నేక్  సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్ కు  సమాచారం ఇవ్వగా, వారు కొండచిలువను పట్టుకొని, అటవీప్రాంతంలో విడిచిపెట్టారు.