
వర్ధన్నపేట, వెలుగు: వరంగల్జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన భిక్షపతి మేకలను పాకలో ఉంచాడు. శుక్రవారం తెల్లవారుజామున కుక్కలు దాడిచేయడంతో 11 మేకలు మృతి చెందాయని బాధితుడు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉందని మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.