
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం వెలుగుచూసింది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన 11 మంది పర్వతారోహకులు దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్-హిమాచల్ సరిహద్దుల్లోని 17 వేల అడుగుల ఎత్తులో లాంఖగా కనుమ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్వతారోహకులు అక్టోబర్ 18న భారీగా మంచు కురవడంతో దారితప్పారు. ఈ విషయం అక్టోబర్ 20న ఎన్డీఆర్ఎఫ్ దృష్టికి వచ్చింది. దాంతో అడ్వాన్స్‌డ్ లైట్ హెలీకాప్టర్లతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. దారితప్పిన వారిలో ట్రెక్కర్లతో పాటు పోర్టర్లు, గైడ్లు కూడా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం 15,700 అడుగుల ఎత్తులో 4 మృతదేహాలను కనుగొన్నారు. ఆ తర్వాత 16,800 అడుగుల ఎత్తులో ప్రాణాలతో ఉన్న ఓ ట్రెక్కర్‌ను రెస్క్యూ చేశారు. అక్టోబర్ 22న మరో వ్యక్తిని కూడా కాపాడారు. అదే రోజు మరో 5 మృతదేహాలు లభించాయి. డోగ్రా స్కౌట్స్, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ బృందాల జాయింట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో మరో 2 మృతదేహాలను గుర్తించారు. దాంతో ఇప్పటివరకు మొత్తం 11 మృతదేహాలు లభించాయి. కాగా.. గల్లంతైన మిగతావారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు.