కామారెడ్డి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ తో 112 సెల్ ఫోన్లు రికవరీ

కామారెడ్డి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ తో 112 సెల్ ఫోన్లు రికవరీ

కామారెడ్డిటౌన్,  వెలుగు : కామారెడ్డి జిల్లాలో పొగొట్టుకున్న, అపహరణకు గురైన 112 సెల్​ఫోన్లను స్పెషల్ డ్రైవ్ ద్వారా  రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్​చంద్ర గురువారం తెలిపారు.  రికవరీ చేసిన సెల్​ఫోన్ల విలువ రూ.18 లక్షల వరకు ఉంటుందన్నారు. సీఈఐఆర్ పోర్టర్​ద్వారా  ప్రతి నెలా జిల్లాలో 150 వరకు సెల్​ఫోన్లను రికవరీ చేస్తున్నామన్నారు. సెల్​ఫోన్​ పోయినా, చోరీకి గురైనా సంబంధిత పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలన్నారు.  

సీఈఐఆర్ పోర్టర్​లో ఐఎంఐ నంబర్ బ్లాక్​ చేసి  ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించవచ్చన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ.3 కోట్ల విలువైన 1,834  సెల్​ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.  సెల్​ఫోన్ల ద్వారానే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.