రాజపేట, వెలుగు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 11వ జోనల్ స్థాయి బాలుర క్రీడలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రాజపేట వేదికగా గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాల డిస్టిక్ కోఆర్డినేటర్లు శ్రీనివాస్ రావు సుధాకర్ ఈ క్రీడలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడా పోటీలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ఈ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో యాదాద్రి జోన్ లోని 13 విద్యాసంస్థల నుంచి 1100 మందికి పైగా విద్యార్థులు 9 విభాగాల్లో పోటీపడుతున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
