మసీద్‌లో ఏసీ పేలి 12 మంది మృతి

మసీద్‌లో ఏసీ పేలి 12 మంది మృతి

మసీదులో ఎయిర్ కండీషనర్లు పేలి 12 మంది చనిపోయిన ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది. నారాయణగంజ్ జిల్లాలోని ఓ మసీదులో శుక్రవారం రాత్రి ఏసీలు పేలి 12 మంది చనిపోగా.. 25 మందికి పైగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఇషా ప్రార్థనల తరువాత వీరంతా మసీదు నుండి బయటకువచ్చేముందు ఏసీలలో గ్యాస్ లీకయి మంటలు అంటుకున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. మూడంతస్తుల మసీదులో మొత్తం 100 మంది ఉండగా.. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ మంటల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లోని మొత్తం ఎనిమిది ఎయిర్ కండిషనర్లకు మంటలు అంటుకున్నాయని వారు తెలిపారు.

ఈ మంటల్లో గాయపడిన దాదాపు 37 మందిని ఢాకాలోని షేక్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఎక్కువ మందికి 60 నుంచి 70 శాతం కాలిన గాయాలయ్యాయని డాక్టర్ సమంతా లాల్ సేన్ తెలిపారు. వారిలో 12 మంది తీవ్రగాయాలతో శనివారం ఉదయం వరకు మరణించారని డాక్టర్ తెలిపారు. మరో 25 మంది ఆరోగ్య పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉందని వైద్యులు తెలిపారు.

మసీదులో జరిగిన భారీ పేలుళ్లతో మసీదు కిటికీ అద్దాలు, సీలింగ్ ఫ్యాన్లు, వైర్లు, ఎలక్ట్రిక్ స్విచ్‌బోర్డుల వీధిలోకి ఎగిరి పడ్డాయని నారాయణగంజ్‌లోని ఫతుల్లా పోలీస్ స్టేషన్ అధికారి షఫీకుల్ ఇస్లాం తెలిపారు. దాదాపు అరగంట పాటు ప్రయత్నిస్తే కానీ మంటలు అదుపులోకి రాలేదని అగ్నిమాపక అధికారి కమ్రుల్ అహ్సాన్ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్ మరియు సివిల్ డిఫెన్స్ ఒక కమిటీని ఏర్పాటు చేశాయి.

For More News..

సుశాంత్ కేస్: డ్రగ్స్ లింకులో రియా చక్రవర్తి సోదరుడు అరెస్ట్

మీటర్ కరెక్ట్.. పెట్రోల్ మాత్రం ఇన్ కరెక్ట్

మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్