జూరాల ప్రాజెక్ట్‌‌కు12 గేట్లు ఓపెన్

జూరాల  ప్రాజెక్ట్‌‌కు12 గేట్లు ఓపెన్

గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్‌‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 71 వేల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండడంతో 12 గేట్లు ఓపెన్‌‌ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల డ్యాం వద్ద ప్రస్తుతం 318.200 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. గేట్ల ద్వారా 49,416 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 

576 అడుగులకు సాగర్‌‌

హాలియా, వెలుగు : ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్‌‌కు 1,21,400 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో నీటి మట్టం 576 అడుగులకు చేరుకుంది. మరో 15 అడుగుల మేర నీరు చేరితే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. ఎగువ నుంచి వచ్చే వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లోనే సాగర్‌‌ పూర్తిగా నిండి, గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. సాగర్‌‌ నుంచి ఎడమకాల్వకు 3,972, కుడి కాైల్వకు 511, ఏఎమ్మార్పీకి 1800 కలిపి మొత్తం 6,283 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.