12 మంది నేపాలీల ఓట్లు తొలగింపు..సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని ఒకే పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో నమోదు

12 మంది నేపాలీల ఓట్లు తొలగింపు..సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని ఒకే పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో నమోదు
  • ఆధారాలు చూపకపోవడంతో తొలగించిన అధికారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  బోగస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిపీటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డూప్లికేట్, అనామలస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓట్ల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెన్సివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా చేపట్టిన విచారణల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒకే పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 12 మంది ఓటర్లుగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. వీరి వద్ద భారత పౌరసత్వాన్ని నిరూపించే ఆధారాలు లేకపోవడంతో ఓటుహక్కు రద్దు చేశారు.

తొలుత వీరికి బీఎల్ వోలు నోటీసులు జారీ చేశారు. హియరింగ్ కు వచ్చి, సరైన ఆధారాలు చూపకపోవడంతో వారి ఓట్లను తొలగించారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 12.53 లక్షల మంది ఓటర్లకు సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2002 వివరాలు, పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని నోటీసులు జారీ చేశారు. వీరిలో ఐదారు వేల మంది నుంచి నోటీసులకు సమాధానాలు రాలేదని అధికారులు తెలిపారు. 

30న తుది ఓటరు జాబితా..

నోటీసులు అందుకున్నంత మాత్రాన ఓట్లు తొలగించినట్లు కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. విచారణకు హాజరై అవసరమైన ఆధారాలు సమర్పించిన వారి పేర్లు తుది జాబితాలో కొనసాగుతాయని తెలిపారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం వచ్చి, ఓటు నమోదు చేసుకున్న వారిలో కొందరికి స్వస్థలాల్లోనూ ఓట్లు ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు చెప్పారు. ఈ నెల 30న తుది ఓటరు జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది