తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇందులో హైదరాబాద్ లో 9, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఒక్కొక్కటి నమోదు అయింది. ప్రస్తుతం తెలంగాణలో 38 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు 1322 మంది కరోనా పరీక్షలు నిర్వహించింది తెలంగాణ వైద్యారోగ్య సంస్థ. 

తెలంగాణ‌లో శుక్రవారం (డిసెంబర్22) ఆరు క‌రోనా కేసులు నమోదు అయ్యాయి.  రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున పదేండ్ల లోపు పిల్లలు, 60 యేండ్ల పైబడిన  వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఉంటే తక్షణమే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది.