మోడీకి తొమ్మిది డిమాండ్లతో విపక్ష నేతల లేఖ

మోడీకి తొమ్మిది డిమాండ్లతో విపక్ష నేతల లేఖ

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దీనికి సంబంధించి..ప్రధాన విపక్షాలు ఇవాళ(బుధవారం) ప్రధాని మోడీకి లేఖ రాశాయి.9 డిమాండ్లను లేఖలో తెలిపాయి. బహుజన సమాజ్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ మినహా దాదాపు 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు లేఖ రాశాయి.


 9 డిమాండ్లు.. 


..అంతర్జాతీయంగా, దేశీయంగా అన్ని మార్గాల నుంచి వ్యాక్సిన్‌ను కేంద్ర సమీకరించాలి.
.. వెంటనే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ప్రారంభించాలి.
.. కంపల్సరీ లైసెన్సింగ్‌ను దేశీయ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి విస్తరించాలి.
..వ్యాక్సిన్ల కోసం రూ. 35,000 కోట్లు వెంటనే కేటాయించాలి
.. సెంట్రల్‌ విస్తా నిర్మాణం వెంటనే ఆపి.. ఆ మొత్తాన్ని ఆక్సిజన్‌, వ్యాక్సిన్లకు బదిలీ చేయాలి.
.. పీఎం కేర్‌లో ఉన్న మొత్తం నిధులను వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కొనుగోలుకు ఖర్చు చేయాలి 
.. నిరుద్యోగులకు నెలకు రూ. 6000 ఇవ్వాలి
.. నిరుపేదలకు ఉచితంగా బియ్యం/గోధుమలు ఇవ్వాలి
.. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. వీటి రద్దు కోసం పోరాటం చేస్తున్న రైతులు కరోనా బారిన పడకుండా కాపాడాలి.
9 డిమాండ్లతో కూడిన ఈ లేఖపై 12 విపక్షాలు సంతకం చేశాయి.