కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

ఏపీ శాసనసభ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ సమావేశాల నుండి 12  మంది టీడీపీ సభ్యులను స్వీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు.  కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, పయ్యావుల కేశవ్ , నిమ్మల రామానాయుడును ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మిగతా వారిని  ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్వీకర్ తెలిపారు. హౌస్ ను మిస్ లీడ్ చేసినందుకు  సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తెలిపారు.  

అయితే అంతకుముందు స్వీకర్ టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరినే మాత్రమే సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారు సభ నుంచి బయటకు వెళ్లాలని కోరినప్పటికీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేస్తేనే వెళతామని అంటున్నారని... వీరి మొత్తాన్ని సస్పెండ్ చేస్తే తప్ప సభను జరగనివ్వరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సభ్యులను అందరిని సస్పెండ్ చేయాలని మరో మంత్రి దాడిశెట్టి రాజా స్పీకర్‌కు తెలిపారు. దీంతో స్వీకర్ అందరని  సస్పెండ్ చేశారు.

సభ్యులకు ఎంత సమయం ఇచ్చినా వితండవాదం చేస్తుడటంతో టీడీపీ సభ్యులు 12 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.  సస్పెండ్ అయిన వారిలో రామానాయుడు, బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవని, చినరాజప్ప, గణబాబు, పయ్యవుల కేశవ్, గద్దె రామ్మెహన్, రామరాజు, ఏలూరి సంబశివరావు, డోలా వీరాంజనేయస్వామి, రవికుమార్‌లు ఉన్నారు.