కలుషిత నీరు తాగి 120 మందికి అస్వస్థత

కలుషిత నీరు తాగి 120 మందికి అస్వస్థత

వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వారిని  వెంటనే స్థానిక హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆశిష్ అనే వ్యక్తి ... గురుకుల పాఠశాలలో వసతులు బాగా లేవంటూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థుల వీడియోను కూడా షేర్ చేశాడు.

ఆశిష్ ట్వీట్ పై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్...  విద్యార్థుల సమస్యను తక్షణమై పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.నిఖిల, పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డిని ఆదేశించారు. కాగా... కలుషిత నీరు తాగడంతో వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నట్లు విద్యార్థులు వీడియోలో తెలిపారు.