గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో ఐలమ్మ జయంతి వేడుకలు

 గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో ఐలమ్మ జయంతి వేడుకలు

హైదరాబాద్, వెలుగు: వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ 129వ జయంత్యుత్సవాలు గురువారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో ఘనంగా నిర్వహించారు. పలువురు పార్టీ నేతలు ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఈ తరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.