
హైదరాబాద్, వెలుగు: అమెరికాలో చదువుకోవాలని అనుకునే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా విద్యార్థులకు ఎడ్యుకేషన్ యూఎస్ఏ ప్రొవైడర్‌గా వ్యవహరించడానికి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వైఆక్సిస్ సీఆర్ఎస్విభాగం వైఆక్సిస్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ ఒప్పందం మేరకు వై యాక్సిస్ మూడు రాష్ట్రాల విద్యార్థులు అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు పొందేందుకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తుంది.
హైదరాబాద్‘వై యాక్సిస్ ఫౌండేషన్ కార్యాలయంలో అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ జెన్నిఫర్ లార్సన్ , వై యాక్సిస్ ఫౌండేషన్ ట్రస్టీ జేవియర్ అగస్టిన్ యూఎస్ ఎడ్యుకేషన్ సెంటర్ సేవలకు సంబందించిన ఎంఓయూను మార్చుకున్నారు. అమెరికాలో అన్ని రకాల కోర్సులు, యూనివర్సిటీల వివరాలు, స్కాలర్ షిప్స్ కు సంబంధించి పూర్తి వివరాలను ఉచితంగా అందిస్తామని వై యాక్సిస్ తెలిపింది.