
జనగామ, వెలుగు: జనగామలోని బతుకమ్మ కుంటలో శుక్రవారం రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్నెట్బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వేర్వేరుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పోటీల్లో క్రీడాస్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.