మేక్‌‌మైట్రిప్‌‌ బోర్డులో సగం మందికి చైనాతో లింక్‌‌లు: ఈజ్‌‌మైట్రిప్‌‌ చైర్మన్ నిషాంత్ ఆరోపణ

మేక్‌‌మైట్రిప్‌‌ బోర్డులో సగం మందికి చైనాతో లింక్‌‌లు: ఈజ్‌‌మైట్రిప్‌‌ చైర్మన్ నిషాంత్ ఆరోపణ

న్యూఢిల్లీ: ప్రత్యర్ధి కంపెనీ మేక్‌‌మైట్రిప్‌‌పై ఈజ్‌ ‌మై ట్రిప్ చైర్మన్ నిషాంత్‌‌ పిట్టి ఆరోపణలు తీవ్రం చేశారు. ఈ కంపెనీలోని 10 మంది బోర్డ్ డైరెక్టర్లలో 5 మందికి చైనాతో డైరెక్ట్‌‌గా లింక్‌‌లు ఉన్నాయని ఎక్స్‌‌లో పోస్ట్‌‌ చేశారు. మేక్‌‌మైట్రిప్‌‌కు చెందిన నాలుగు ముఖ్యమైన బోర్డ్ కమిటీలలో మూడింటిని  "చైనాతో లింక్‌‌ ఉన్న  ఉన్న డైరెక్టర్లు నడుపుతున్నారు లేదా వీటిపై చైనా ప్రభావం ఎక్కువగా ఉంది" అని ఆయన అన్నారు.

పిట్టి ఆరోపణలపై వ్యాఖ్యానించడానికి మేక్‌‌మైట్రిప్‌‌ నిరాకరించింది.  కానీ ఇది భారతీయ కంపెనీ అని, దేశంలోని అన్ని చట్టాలు, డేటా ప్రైవసీ ఫ్రేమ్‌‌వర్క్‌‌లను పూర్తిగా పాటిస్తోందని తన మునుపటి వైఖరిని కొనసాగించింది. మేక్‌‌మైట్రిప్‌‌లో  చైనీస్ కంపెనీ ట్రిప్‌‌డాట్‌‌కామ్‌‌   కీలక నియామకాలు జరిపిందని పిట్టి ఆరోపించారు.