ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌ 13 గేట్లు ఓపెన్‌‌..

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌ 13 గేట్లు ఓపెన్‌‌..
  • ఎగువ నుంచి లక్షకుపైగా క్యూసెక్కుల వరద

గోదావరిఖని, వెలుగు : భారీ వర్షాలు పడుతుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎల్లంపల్లి క్యాచ్‌‌మెంట్‌‌ ఏరియా నుంచి 50,701 క్యూసెక్కులు, ఎస్సారెస్పీ 50 వేలు, కడెం ప్రాజెక్ట్‌‌ నుంచి 4,744 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లికి వస్తోంది. ప్రాజెక్ట్‌‌ పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండింది. 

దీంతో 13 గేట్లను ఓపెన్‌‌ చేసి 1,05,445 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌‌ మెట్రో వాటర్‌‌ వర్క్స్‌‌ స్కీమ్‌‌ కింద 288 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌‌ చేస్తున్నారు.