తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా లారీని ఢీకొట్టిన మినీబస్సు.. 13 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా లారీని ఢీకొట్టిన మినీబస్సు.. 13 మంది మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2024, జూన్ 28వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలోని హవేరీ జిల్లాలోని బైడగి తాలూకాలో రోడ్డుప్రక్కన ఆగి ఉన్న లారీ ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన ఓ మినీబస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

యల్లమ్మ దేవి దర్శనార్థం తీర్థయాత్రకు వెళ్లిన కొందరు.. యాత్ర ముగించుకుని బెళగావి జిల్లాలోని సవదత్తి నుంచి మినీబస్సు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.