ఏపీకి రూ.13 లక్షల కోట్ల  ఇన్వెస్ట్​మెంట్లు

ఏపీకి రూ.13 లక్షల కోట్ల  ఇన్వెస్ట్​మెంట్లు
  • ఏపీకి రూ.13 లక్షల కోట్ల  ఇన్వెస్ట్​మెంట్లు
  • మొత్తం 340 ఇన్వెస్ట్​మెంట్​ ప్రపోజల్స్​
  •  ఆరు లక్షల జాబ్స్ వచ్చే చాన్స్​
  • విశాఖ నుంచే పాలన ఉంటుందన్న సీఎం జగన్​

విశాఖపట్నం: పలు కంపెనీల నుంచి తమ రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్మోహన్​ రెడ్డి ప్రకటించారు. విశాఖపట్నంలో శుక్రవారం మొదలైన రెండు రోజుల గ్లోబల్​ ఇన్వెస్టర్స్​ సమ్మిట్​ 2023లో  ఆయన మాట్లాడారు. ఈ ఇన్వెస్ట్​మెంట్స్​ వల్ల ఆరు లక్షల జాబ్స్​ వస్తాయని తెలిపారు. మరికొన్ని ఒప్పందాలు శనివారం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుతుందని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని జగన్​ స్పష్టం చేశారు. ‘‘మాకు మొత్తం 340 ఇన్వెస్ట్​మెంట్‌​ ప్రపోజల్స్​ రావడం గర్వకారణం. దాదాపు 20 సెక్టార్ల నుంచి పెట్టుబడులు  వచ్చాయి.  ఏపీ అన్ని రంగాల్లో ముందుకు సాగుతోంది. సహజ వనరులకు కొరత లేదు. భారీ తీరప్రాంతం ఉంది. ఆరు పోర్టులు, ఆరు ఎయిర్​పోర్టులు, మూడు ఇండస్ట్రియల్​ కారిడార్లను కంపెనీలు వాడుకోవచ్చు”అని సీఎం పేర్కొన్నారు. ఇన్వెస్టర్స్​ సమ్మిట్​ సందర్భంగా 92 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి.      

పెట్టుబడుల వివరాలు ఇవి...

ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 గిగావాట్ల రెన్యువబుల్​ సోలార్​పవర్​ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. రిలయన్స్  కేజీడీ6 లో రూ.1.50 లక్షల కోట్లను ఇన్వెస్ట్​ చేసిందని అన్నారు.   తమ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు కొత్త సిమెంట్ తయారీ ప్లాంట్లు, 15వేల మెగావాట్ల రెన్యువబుల్​ఎనర్జీ ప్రాజెక్టులు,  డేటా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తుందని అదానీ పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈవో కరణ్ అదానీ ఈ సందర్భంగా తెలిపారు. కడప, నడికుడిలో సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విశాఖపట్నంలో 400  మెగావాట్ల  డేటా  సెంటర్​ను నిర్మిస్తామని వివరించారు. ఎన్​టీపీసీ రూ. 2.35 లక్షల కోట్ల పెట్టుబడితో 77వేల మందికి ఉపాధి కల్పించే మూడు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. స్టీల్​ కంపెనీ  జేఎస్​డబ్ల్యూ గ్రూప్ 9,500 మందికి ఉపాధి కల్పించే రూ. 50,632 కోట్ల పెట్టుబడితో కూడిన ఆరు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.  అరబిందో గ్రూప్ రూ.10,365 కోట్ల పెట్టుబడికి ఐదు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది.  జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్  స్టీల్​ ఫ్యాక్టరీని నిర్మించడానికి రూ. 10వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. 

పోర్టులను హైవేలతో  కనెక్ట్ చేస్తాం : మంత్రి గడ్కరీ

ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అన్ని ఓడరేవులను నాలుగు లేన్ల హైవేలతో లింక్​ చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా,  రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు  రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు.  మైనర్, మేజర్ పోర్ట్, ప్రైవేట్ లేదా స్టేట్ పోర్ట్ అనే తేడా  లేకుండా అన్ని రకాల పోర్టులకు కనెక్టివిటీని మెరుగుపరిచే రోడ్లను నిర్మిస్తామని ప్రకటించారు. విశాఖపట్నం-–చెన్నై, చెన్నై–-బెంగళూరు, హైదరాబాద్-–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు ఏపీ మీదుగా వెళ్తాయని చెప్పారు. నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, విజయవాడలను కలుపుతూ 430 కిలోమీటర్ల ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామన్నారు.