బోధన్ మండలం బండార్పల్లి గ్రామంలో బాలిక మిస్సింగ్

బోధన్ మండలం బండార్పల్లి గ్రామంలో బాలిక  మిస్సింగ్

బోధన్, వెలుగు : బాలిక మిస్సింగ్​అయిన ఘటన మండలంలోని బండార్​పల్లి గ్రామంలో జరిగింది. బోధన్​ రూరల్​ ఎస్సై మచ్ఛేందర్​ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రెడ్డి అంజలి (13) ఈనెల8న మధ్యాహ్నం  ఇంటి నుంచి  వెళ్లింది. రాత్రి వరకు తిరిగిరాలేదు. 

చట్టుపక్కల ప్రాంతాలు,  బంధువుల ఇండ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళన చెందిన బాలిక తల్లి రెడ్డి మాధవి పోలీస్​ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయగా మిస్సింగ్​కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై తెలిపారు.