నేపాల్ బస్సు ప్రమాదంలో 14మంది మృతి..

నేపాల్ బస్సు ప్రమాదంలో 14మంది మృతి..

నేపాల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ నుంచి 40 మంది యాత్రికులతో నేపాల్ వెళ్లిన బస్సు.. అబుఖైరేని, తన్ హున్ ప్రాంతాల మధ్య పెద్ద లోయలో పడింది.బస్సు పల్టీలు కొడుతూ.. లోయలో తిరగబడింది. ఈ ఘటనలో 14 మరణించగా 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

బస్సులోని ప్రయాణికులను కాపాడేందుకు సాయుధ బలగాలు, సైన్యం సాయం కావాలని సమాచారం ఇచ్చారు. లోయ నుంచి బాధితులను బయటకు తీసుకు వచ్చే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.ఈ బస్సు యూపీ రాష్ట్రం గోరఖ్ పూర్ నుంచి బయలుదేరింది. బస్సులోని యాత్రికులు అందరూ భారతీయులే అని తెలుస్తోంది. దీంతో యూపీ సర్కార్ సైతం స్పందించింది. భారత ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. బాధితులను సురక్షితంగా, క్షేమంగా ఇండియా తీసుకొచ్చేందుకు.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని తెలిపారు అధికారులు.