అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 17మంది యాత్రికులతో  ప్రయాణిస్తున్న ఓ  వాహనం ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని దగ్గరలోని మోరిగావ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  మకర సంక్రాంతి  సందర్భంగా లోహిత్ నదిలో పుణ్యస్నానం చేసి తిరిగి గౌహతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.