ఐదేండ్లలో రాష్ట్రంలో 1.42 లక్షల టన్నుల చెత్త రీసైక్లింగ్

ఐదేండ్లలో రాష్ట్రంలో 1.42 లక్షల టన్నుల చెత్త రీసైక్లింగ్
  • మరో లక్షన్నర టన్నుల వేస్ట్ ఇళ్లు, ఆఫీసుల్లోనే 
  • ఇందులో సగానికిపైగా టీవీలు, ఫ్రిజ్​లు
  • ఈ - చెత్తలో దక్షిణాదిలో హైదరాబాద్​ది సెకండ్ ప్లేస్  
  • ఎలక్ట్రానిక్ చెత్త సేకరణలో టీఎస్ పీసీబీ నిర్లక్ష్యం 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మహానగరంలో పాడైపోయిన కంప్యూటర్లు, టీవీలు, ఫ్రిజ్​లు, స్మార్ట్ ఫోన్లు తదితర ఈ – వేస్ట్ టన్నుల కొద్దీ పోగవుతోంది. ఐదేళ్లలో హైదరాబాద్​లో 1.42 లక్షల టన్నుల ఈ–వేస్ట్​ను సేకరించి రీసైక్లింగ్ చేయగా.. మరో లక్షన్నర టన్నుల ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇళ్లు, ఆఫీసులు, స్టోర్ రూమ్​లలో పేరుకుపోయింది. కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైంటిస్టుల అంచనా ప్రకారం.. 2021 –22లో హైదరాబాద్​లో ఏకంగా రోజుకు సగటున 200 టన్నుల చొప్పున ఏడాదిలో 75,869 మెట్రిక్ టన్నుల చెత్త పోగయ్యిందంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో రీసైక్లింగ్​కు తరలించిన ఈ–వేస్ట్​ 43 వేల టన్నులు మాత్రమే. ఇందులో పాడైపోయిన టీవీలు, ఫ్రిజ్​లు, కూలర్లు, కంప్యూటర్ల రూపంలో సుమారు 60% చెత్త ఇళ్ల నుంచే వెలువడుతుండగా, మిగతా 40% ఆఫీసులు, ఇండస్ట్రీల నుంచి పోగవుతున్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ చెత్త ఉత్పత్తిలో హైదరాబాద్ నగరం దక్షిణాదిలో బెంగళూర్ తర్వాతి ప్లేస్​లో, దేశవ్యాప్తంగా ఏడో స్థానంలో నిలిచింది. 

హైదరాబాద్​లో ఏటా పెరుగుతున్న ఈ – వేస్ట్​

దేశంలో 21 రకాల ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ ఏటేటా పెరుగుతుండడంతో వాటి నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 2016లో ఈ–వేస్ట్​(మేనేజ్మెంట్) రూల్స్ –2016ను రూపొందించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 472 రీసైక్లింగ్/డిస్మాంట్లింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో ఏడాదికి 1.13 లక్షల టన్నుల ఈ – చెత్తను ప్రాసెస్ చేయగలిగిన 18 యూనిట్లను దశలవారీగా నెలకొల్పారు. అయితే ఈ – చెత్త సేకరణలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఏటా 40 వేల టన్నులకు మించి చెత్త ప్రాసెస్ కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో 2016 – 17లో 6,299.23 మెట్రిక్ టన్నులు, 2017–18లో 2846 మెట్రిక్ టన్నులు, 2018–19లో 14,640.57 టన్నులు, 2019–20లో 37,858 టన్నులు, 2020–21లో 38,346 టన్నులు, 2021–22లో 43,136 టన్నులు మాత్రమే ప్రాసెస్ చేయగలిగారు. ఉదాహరణకు 2019 –20లో 37,859 మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ చెత్తను ప్రాసెస్ చేయగా, ఇందులో ఇళ్లలో వాడే ఎలక్ట్రికల్స్, ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీలు కలిపి 13,484.83 మెట్రిక్ టన్నులు,  ఫ్రిజ్​లు 12,570.27 మెట్రిక్ టన్నులు,  ఐటీ, టెలికాం రంగాల్లో వాడే కంప్యూటర్లు 940.9 మెట్రిక్ టన్ను లు, మొబైల్స్ 212.4  మెట్రిక్ టన్నులు, కాట్రిడ్జ్​లు, ప్రింటర్లు 194.6 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. 

దేశవ్యాప్తంగా రీసైక్లింగ్ అయ్యేది 25%లోపే.. 

అధికారిక లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా గత ఏడాది 12.61 లక్షల టన్నుల ఈ – చెత్త పోగుపడినట్లు అంచనా వేయగా.. ఇందులో రీసైక్లింగ్ ద్వారా ప్రాసెస్ చేసింది కేవలం 3.89 లక్షల టన్నులు మాత్రమే. 2020–21లో సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ఈ – చెత్త ఉత్పత్తి అయితే 3,54,540 మెట్రిక్ టన్నులు, 2019–-20లో 10,14,961.2 టన్నుల ఈ-–చెత్తలో 2,22,436 టన్నులు, 2018–19లో 7,71,215 మెట్రిక్ టన్నులకుగాను 1,64,662 టన్నులు, 2017-–18లో 7,08,445 టన్నులకుగాను 69,413 టన్నులు, 2016–-17లో 22,700 టన్నులను సేకరించి, రీసైక్లింగ్ చేశారు. పూర్తి స్థాయిలో రీసైక్లింగ్ చేయని కారణంగా ఈ – చెత్తలో లభించే ఇనుము, సీసం, రాగితోపాటు బంగారం, నియోడిమియం, కాడ్మియం వంటి విలువైన లోహాలూ భూమిలో కలిసిపోతున్నాయి. సంవత్సరంలో ఈ – చెత్త నుంచి సుమారు రూ.8 వేల కోట్ల విలువైన బంగారం వెలికితీసే అవకాశాన్ని దేశం కోల్పోతున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, అండ్ ఇండస్ట్రీ గతంలో లెక్కగట్టింది. 

సాధారణ చెత్తతోపాటే ఈ–వేస్ట్​.. 

పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి హానీ చేసే ఈ వ్యర్థాలను రోజూవారీ చెత్తతోపాటే బయట పడేస్తుండడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీవీల్లో వినియోగించే క్యాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రే ట్యూబుల్లో లెడ్, బేరియం ఇతర భారలోహాలు, నీటిని విషయంగా మార్చే సల్ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. కొందరు కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేబుల్ వైర్లు, విడిభాగాలు, రబ్బరు, ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తువులను కాల్చడంతో పాలీ ఆరోమాటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైడ్రోకార్బన్లు వెలువడి భూమి, నీరు, గాలిని విషతుల్యం చేస్తున్నాయి. ప్రింటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులను వృథాగా పడవేయడంతో బ్రోమిన్, బెరీలియం, క్యాడ్మియం, మెర్క్యూరీ వంటి పదార్థాలు భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. ప్రింటర్లు, టోనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాట్రిడ్జులు, కీబోర్డులలోని హైడ్రోకార్బన్లు కాల్చడంతో భూమిని, భూగర్భజలాలను, పీల్చేగాలిని కలుషితం చేస్తున్నాయి. గాలి, నీటి కాలుష్యం కారణంగా ప్రజలకు చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, కిడ్నీ వ్యాధులు.. తదితర సమస్యలు వచ్చే ప్రమాదముంది.

చెత్త కుప్పల్లోకి ఈ- వేస్ట్..

రాష్ట్రంలో ఈ – వేస్ట్ రీసైక్లింగ్ నిర్వహణ సరిగ్గా లేదు. హైదరాబాద్ లో రీసైక్లింగ్ కేవలం కాగితాలకే పరిమితమైంది. ఈ – వేస్ట్ లో చాలా ప్రమాదకరమైన లిథియం బ్యాటరీ, ప్రింటర్ సర్క్యూట్ బోర్డులను సాధారణ చెత్తతో కలిపి వేస్తున్నారు. వీటిని కాల్చడం వల్ల విషతుల్యమైన వాయువులు గాలిలో కలుస్తున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ప్రింటర్ సర్క్యూట్ బోర్డుల నుంచి 21 రకాల మెటల్స్ వస్తాయి. కానీ ఆ లోహాలను ప్రస్తుతం రికవరీ చేయడం లేదు. 

- ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి, ఎన్విరాన్ మెంట్ ఎక్స్ పర్ట్