తెలంగాణలో1,489 కరోనా పాజిటివ్ కేసులు,11మంది మృతి

V6 Velugu Posted on Jun 16, 2021

తెలంగాణలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,16,252 కరోనా టెస్టులు నిర్వహించగా 1,489 మందికి పాజిటివ్ గా  నిర్ధారణ అయ్యింది. GHMC ఏరియాలో 175, నల్గొండ జిల్లాలో 131, ఖమ్మం జిల్లాలో 118 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 2 కేసులు గుర్తించారు.

1,436 మంది కరోనా నుంచి కోలుకోగా.. 11 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,07,925 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,84,429 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 19,975 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,521కి పెరిగింది. కరోనా మరణాల శాతం జాతీయస్థాయిలో 1.3 కాగా.. తెలంగాణలో అది 0.57 శాతానికి తగ్గింది.

Tagged Telangana, 11 deaths, corona positive cases1489

Latest Videos

Subscribe Now

More News