ఇన్​స్పైర్ అవార్డులకు 149 మంది ఎంపిక

ఇన్​స్పైర్ అవార్డులకు 149 మంది ఎంపిక

మంచిర్యాల, వెలుగు: విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించి, బాల సైంటిస్టులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఇన్ స్పైర్ -మనక్ పథకం అవార్డులకు 2023-24 విద్యా సంవత్సరంలో జిల్లాలో 149 మంది ఎంపికయ్యారని మంచిర్యాల డీఈఓ ఎస్.యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు.

విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్టులతో జూన్​లో నిర్వహించే  జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గైడ్ టీచర్ల సూచనలు, సలహాలతో జాతీయ స్థాయి పోటీల్లోనూ ఎంపికయ్యేలా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.