చైనాకు 15 రోజులు విమాన సర్వీసులు నిలిపివేత

చైనాకు 15 రోజులు విమాన సర్వీసులు నిలిపివేత

ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా. చైనాలో ఇప్పటికే ఎంతో మందిని బలితీసుకుంది. దీంతో భారత్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. చైనాకు విమాన సర్వీసులు నిలిపివేయనుంది. రేపటి(శుక్రవారం) నుంచి ఫిబ్రవరి 14 వరకూ ఢిల్లీ-షాంఘై విమానసర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. బెంగళూరు హాంకాంగ్, ఢిల్లీ- చెంగ్డూ మార్గాలలో కూడా విమాన సర్వీసులను రేపటి నుంచి నిలిపివేస్తున్నట్లు ఆయా విమాన సంస్థలు ప్రకటించాయి.