హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం..టూరిస్ట్ బస్సుపై పడ్డ కొండచరియలు..15మంది మృతి

హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం..టూరిస్ట్ బస్సుపై పడ్డ కొండచరియలు..15మంది మృతి

హిమాచల్​ ప్రదేశ్​ లోని ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టులతో వెళ్తున్న ప్రైవేట్​ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు, బురద పడటంతో బస్సు పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయింది.. ఈ ప్రమాదంలో 15 మంది టూరిస్టులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 25 నుంచి 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం (అక్టోబర్​ 7) రాత్రి హిమాచల్​ ప్రదేశ్​ లోని బిలాస్​ పూర్​ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 

బిలాస్​ పూర్​ జిల్లాలోని ఝండుట సబ్​ డివిజన్​ లోని బల్లు వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడి టూరిస్టు బస్సుపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా బండరాళ్లు, బురద శిధిలాల కింద చిక్కుకుపోయింది. 

హిమాచల్ పోలీసులు, SDRF,ఇతర సంస్థలు సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 6:40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాందలో ఓ చిన్నారి సురిక్షితంగా బయటపడింది.