
ఢాకా: బంగ్లాదేశ్లో బుధవారం వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో 15మంది భవన నిర్మాణ కార్మికులు మృతిచెందారని అధికారులు తెలిపారు. ఇసుక లోడ్ తో వెళుతున్నట్రక్కు తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో కుతుబ్పూర్ ఏరి యాలో ఓవ్యాన్ను ఢీకొట్టింది. ఈ మేరకు స్థానిక మీడియా సంస్థ ఢాకా ట్రిబ్యూన్ కథనాన్ని ప్రచురిం చింది. ట్రక్కు డ్రైవరు నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ఉస్మానీనగర్ఫైర్ సర్వీస్ సిబ్బంది తెలిపా రు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో 25 నుంచి 30 మంది ప్రయాణిస్తు న్నారు. ప్రమాద స్థలంలో 11మంది, ఆస్పత్రికి తరలిస్తుండగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఇస్లామ్ చెప్పారు. బాధిత కుటుంబాలకు మృతదేహాలను అప్పగించామని అడిషనల్ ఎస్పీ మసూద్ రానా వెల్లడించారు.