ఈ అబ్బాయిపై పాములు పగబట్టాయా.. రెండు నెలల్లో తొమ్మిది సార్లు కాటు

ఈ అబ్బాయిపై పాములు పగబట్టాయా.. రెండు నెలల్లో తొమ్మిది సార్లు కాటు

మీరు ఇప్పుడు రోమాలు నిక్కబొడుచుకునే ఓ సంఘటన గురించి చదవబోతున్నారు. హా.. అని నోరళ్లబెట్టి ఆశ్చర్యపోయే ఒక ఉదంతం గురించి తెలుసుకోబోతున్నారు. ఆశ్చర్యంతో, అనుమానంతో, భయంతో కూడుకున్న ఘటన ఇది. 15 ఏళ్లబాలుడిని  పాము కాటేసిందంటే.. అది ప్రమాదవశాత్తూ జరిగిందని అనుకోవచ్చు. అదే రెండుమూడు సందర్భాల్లో కాటేస్తే.. ఏం జరిగిందా అని ఆలోచిస్తారు. కానీ ఒకే బాలుడు ఏకంగా తొమ్మిది  సార్లు  రెండు నెలల కాలంలో పాముకాటుకు గురయ్యాడు అంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. అతడి పేరే  ప్రజ్వల్‌..

చాలా మంది పామును చూసిన భయంలో దానిపై రాళ్లు, కర్రలు విసురుతుంటారు. ఇలా జరిగిన తర్వాత మళ్లీ ఏదైనా పాము కనిపిస్తే.. లేదా పదే పదే పాములు కనిపిస్తే ఏదైనా పాము పగ పట్టిందని పెద్దలు చెబుతుంటారు. ఇది ఎంత వరకు నిజమో ఎవరికీ తెలియదు కానీ తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రజ్వల్ అనే విద్యార్థిని మాత్రం ఓ పాము వెంటాడుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ పాము ప్రజ్వల్‌ని రెండు నెలల వ్యవధిలోనే 9 సార్లు కాటేసింది. దీంతో ప్రజ్వల్ తల్లిదండ్రులు తమ కొడుకు పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.

కర్నాటకలోని కల్బుర్గి జిల్లా చితాపూర్ తాలూకాలోని హల్‌కట్టా గ్రామానికి చెందిన ప్రజ్వల్ (15)  గురించి అందరూ వింతగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ బాలుడిని రెండు నెలల కాలంలో తొమ్మిది  సార్లు పాముకాట్లకు గురయ్యాడు. నిజానికి ప్రజ్వల్  తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.  జూలై 3న ప్రజ్వల్  తన ఇంటి పెరట్లో ఆడుకుంటున్న సమయంలో  పాము కాటువేసింది.  వెంటనే కలబురగిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.   ఆ తరువాత రెండు నెలల కాలంలో  తొమ్మిది సార్లు  కాటు వేసింది. ప్రజ్వల్ తల్లిదండ్రులు తమ బిడ్డ పరిస్థితిపై అప్రమత్తంగా ఉండడం వల్ల పాము కాటు వేసిన ప్రతిసారి చికిత్స చేయించారు.

పాము ద్వేషం పన్నెండేళ్ల పాటు ఉంటుందని పెద్దలు అంటుంటారు.. ఇలా మరో 15 ఏళ్ల బాలుడు పాము కాటుకు గురయ్యాడు. పాము కాటుతో బాలుడు, అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. . ఈ బాలుడిని ఒకే పాము తొమ్మిది సార్లు కాటువేయడంతో బాలుడి కుటుంబం అయోమయంలో పడింది.లా పదే పదే జరగడంతో అతని కుటుంబం హలకర్తి గ్రామాన్ని వదిలి, చిత్తాపూర్ తాలూకా వాడిలో స్థిరపడింది.

తమ కొడుకును పదే పదే ఒకే పాము కాటు వేయడంలో ఏమైనా నాగదోషం ఉందేమో అనే సందేహంలో ఎన్నో పూజలు కూడా చేశారు ప్రజ్వల్ తల్లిదండ్రులు.  నాగ దోషానికి ఈ కుటుంబం చేయని పూజ లేదు.  ఇంకా కుల దైవం కోసం చిన్న గుడి కూడా నిర్మించారు. అందరికీ షాక్ కలిగించే విషయం ఏమిటంటే.. ప్రజ్వల్‌ని కాటు వేసే పాము అతనికి తప్ప ఇతరులు ఎవరికీ కనిపించదు. అలా కాదు, పాము కాటు వేయకపోయినా ప్రజ్వల్ సరదాగా చెప్తున్నాడా అంటే అలా కూడా లేదని వైద్యులు చెబుతున్నారు. పాము కాటు వేసిన వెంటనే చర్మంపై పాము పళ్ల గుర్తు కనిపిస్తుంది. రక్తం కూడా వస్తుంది.  పదే పదే ఒకరినే ఎందుకు కాటేస్తున్నాయో వైద్యరంగం కూడా చెప్పలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.