150 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్టు

150 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్టు

కుత్బుల్లాపూర్ పీఎస్ పరిధిలోని దుండిగల్ లో భారీగా గంజాయి పట్టుబడింది.విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు, దుండిగల్ పోలీసుల ఆధ్వర్యంలో దుండిగల్ ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో150 కిలోల (75 ప్యాకెట్ ల) గంజాయిని పోలీసలు పట్టుకున్నారు. ఈ ముఠాలో 4 నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారి వద్ద నుంచి  రెండు మారుతి, ఒక హోండా సిటీ కార్లు, 4 సెల్ ఫోన్లు, 9,000- వేల నగదును పోలీసలులు స్వాధీనం చేసుకున్నారు. 

అరెస్టు అయిన వారిని బన్వత్ చందర్, లునావత్ నగేష్, గండు అజయ్, నునావత్ వెంకటేష్ లుగా పోలీసులు గుర్తించారు. స్దానిక దుండిగల్ పోలీసు స్టేషన్ లో నిందితులను నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయు, కార్లు, సెల్ ఫోన్లు, నగదును అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.