లాక్‌డౌన్‌ బ్రేక్‌.. కర్నాటకలో రథోత్సవంలో

లాక్‌డౌన్‌ బ్రేక్‌.. కర్నాటకలో రథోత్సవంలో
  • పాల్గొన్న 150 మంది
  •  కేసు నమోదు చేసిన పోలీసులు

కలబుర్గి: కరోనా రోజురోజుకి వ్యాప్తి చెందుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఇళ్లలోనే ఉంటూ లాక్‌డౌన్‌ పాటించాలని అధికారులు మొత్తుకుని చెప్తున్నారు. గుంపులు గుంపులుగా ఉండకుండా సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. కానీ చాలా మంది దాన్ని పట్టించుకోవడం లేదు. తమ పని తాము చేసుకుని పోతాం అని లాక్‌డౌన్‌ను పదే పదే ఉల్లంఘిస్తున్నారు. కర్నాటకలోని చిత్తాపూర్‌‌ గ్రామస్థులు లాక్‌డౌన్‌ను బ్రేక్‌ చేశారు. సిద్ధలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో 150 మంది భక్తులు పాల్గొన్నారు. దాదాపు 100 – 150 మంది రథోత్సవంలో పాల్గొన్నారని, వారిలో 20 మందిపై కేసు నమోదు చేసి మిగతా వారి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి మార్టిన్‌ చెప్పారు. ఆ ఏరియా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌‌ను సస్పెండ్‌ చేశామన్నారు.