- మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో 1500 మంది కేటాయింపు
- ఆన్‌డ్యూటీగా ప్రకటించాలని ఐఎన్టీయూసీ నేతల డిమాండ్
కోల్‌బెల్ట్,వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో సింగరేణి ఉద్యోగులు దాదాపు 1,500 మంది ఈనెల 11,14,17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్, కౌంటింగ్డ్యూటీలు చేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల ఉద్యోగులతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా కేటాయించారు. ఈ ఎన్నికల్లో సింగరేణి ఉద్యోగులు ఓటు హక్కు వేసేందుకు యాజమాన్యం రెండు గంటల పాటు పర్మిషన్ ఇచ్చింది.
సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల పరిధిలో ఫస్ట్, జనరల్షిప్టుల్లో పనిచేసే ఉద్యోగులకు షిప్ట్ ప్రారంభంలో రెండు గంటలు, ఫ్రీ షిప్టులో పనిచేసే వారికి ఉదయం 11 గంటల నుంచి పర్మిషన్ ఇవ్వనున్నట్లు సింగరేణి పేర్కొంది. కాగా.. డ్యూటీలు పడిన సింగరేణి ఉద్యోగులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఐఎన్టీయూసీ లీడర్లు కోరారు. మంగళవారం ఐఎన్టీయూసీ ఏరియా వైస్‌ప్రెసిడెంట్ దేవి భూమయ్య, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్‌సెక్రటరీ రాంశెట్టి నరేందర్,మందమర్రి జీఎం ఎన్.రాధాకృష్ణను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికల డ్యూటీ చేసే ఉద్యోగులకు స్పెషల్ ఎలక్షన్ లీవ్ ఇస్తే ఆర్థికంగా నష్టపోతున్నారని, ఆన్ డ్యూటీ కల్పిస్తే అలవెన్సులతో పాటు ప్లేడే కూడా లభిస్తుందన్నారు.

