
ఒక వ్యక్తి.. అందునా ముక్కుపచ్చలారని బాలుడు.. తన చావుకు స్కెచ్ వేసుకున్నాడంటే నమ్ముతారా.. ప్రీ ప్లాన్డ్ ఎలా చావాలి.. ఎలా అంతస్తు నుంచి దూకితే ఎలా స్పాట్ లో చచ్చిపోవచ్చు.. అని ఎవ్వరికీ అర్థంకాని విధంగా గేమింగ్ కోడ్ లో మ్యాప్ వేసుకున్నాడంటే నమ్ముతారా.. ఆ కోడ్ ను అర్థం చేసుకోవడానికి పోలీసులకు సైతం ఓ పెద్ద సవాల్ గా మారిందంటే..ఎవ్వరూ నమ్మరు. కానీ ఇది నిజం..పుణెలోని ఓ విద్యార్థి తను ఆత్మహత్య చేసుకునేందుకు గీసిన స్కెచ్ చూసిన పోలీసులు నిర్ఘాంత పోయారు. అసలు ఎందుకు బాలుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇంత తెలివైన బాలుడు ఎందుకు చావాలనుకున్నాడో..15యేళ్ల బాలుడు 14 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. అందరిని కలచివేస్తున్న విషాద ఘటన వివరాల్లోకి వెళితే..
జూలై 26న శుక్రవారం పుణెలో ని ఓ అపార్టుమెంట్ లో బాలుడు 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. బాలుడి చావుకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు జరిపిన దర్యాప్తు కలవరపర్చే నిజాలు బయటికొచ్చారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతను వేసుకున్న స్కెచ్.. పోలీసులను ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంత చిన్న బాలుడు స్వయంగా తన చావు కోసం ఇంత పెద్ద ఎత్తున్న ప్లాన్ చేయడం చూసి షాక్ తిన్నారు. బాలుడికి చెందిన కొన్ని వస్తువులను పరిశీలించిన పోలీసులు ఈ నివ్వెర పోయే నిజాలు తెలిశాయి.
ALSO READ | 3 నెలల క్రితం తప్పిపోయి గుహలో పాములా బుసలు కొడుతూ కనిపించిన యువతి.. వీడియో వైరల్..
పుణెలోని పింప్రి చించువాడ్ ప్రాంతలోని ఓ అపార్టెమెంట్ 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న 10వ తరగతి విద్యార్థి రూంలో ఓ సూసైడ్ నోట్, దానితోపాటు తన చేతితో స్వయంగా ఆత్మహత్య చేసుకునేందుకు గీసిన లే అవుట్ ను పోలీసులు స్వాధీనం చేసుుకున్నారు.ఈ లేఅవుట్ లో స్కెచ్ లు , జంప్ కోసం సూచనలు చేసే డ్రాయింగ్ తోపాటు గేమింగ్ కోడ్ లో వ్రాసిన పేపర్లు ఉన్నాయి. ఈ లేఅవుట్ చూసిన పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. తమ పిల్లలు ఏం చేస్తున్నారు.. వారి మానసిక స్థితి ఎలా ఉంది.. వంటి విషయాలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేశాయి.
బాలుడి ఆత్మహత్యకు ఆన్ లైన్ గేమింగే కారణమా?
మృతుడి తల్లి ఓ ఇంజనీరు.. తండ్రి విదేశాల్లో ఉంటున్నారు. బాధితుడు తల్లి, తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. తండ్రి నైజీరియాలో ఉన్నాడు. బాలుడు ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డాడని, రోజంతా ఈ గేమ్ లలోనే గడిపేవాడని అతని తల్లి పోలీసులు తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న రోజున ఆ బాలుడు.. రోజంగా గదిలోనే ఉండిపోయాడని తెలుస్తోంది. ఘటనకు కొన్ని గంటల ముందు బాలుడు ఆన్ లైన్ గేమింగ్ కోసం కత్తితో ఆడుకున్నాడని.. జూలై 25న రోజంతా గదిలో ఉన్నాడని రాత్రి పూట తినడానికి మాత్రమే బయటికి వచ్చాడని తల్లి చెబుతుంది. అర్థరాత్రి దాటాక వాట్సాప్ గ్రూప్ లో ఓ చిన్నారి భవనం పైనుంచి పడిపోయినట్లు మేసేజ్ అందుకున్న తల్లి.. బాలుడి ఉన్న గదిలో చూడగా అతను కనిపించలేదు. పార్కింగ్ వద్ద రక్తపు మడుగులో చూసింది. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.