3 నెలల క్రితం తప్పిపోయి గుహలో పాములా బుసలు కొడుతూ కనిపించిన యువతి.. వీడియో వైరల్..

3 నెలల క్రితం తప్పిపోయి గుహలో పాములా బుసలు కొడుతూ కనిపించిన యువతి.. వీడియో వైరల్..

మతి స్థిమితం లేని కొందరు మనుషులు కుక్కలా మొరగడం చూసి ఉంటారు. కోతిలా ప్రవర్తించడం గురించి విని ఉంటారు. కానీ.. జార్ఖండ్లో ఓ యువతి ప్రవర్తిస్తున్న తీరు స్థానికులను విస్తుపోయేలా చేసింది. మూడు నెలల క్రితం కనిపించకుండాపోయిన ఆ యువతి ఒక గుహలో పాములా బుసలు కొడుతూ కనిపించింది. అంతేకాదు.. శరీరాన్ని పాములా చుట్టేసుకుని నాలుకతో బుసలు కొడుతుండటం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జార్ఖండ్లోని రాణిదిహ్ గుప్త ధామ్ గుహలో మూడు నెలల క్రితం కనిపించకుండాపోయిన యువతి కనిపించింది. ఆమె కనిపించకుండా పోయిన రోజు నుంచి ఆ కుటుంబం వెతకని చోటు లేదు. మూడు నెలల నుంచి ఆమె ఆచూకీ కోసం వెతుకులాట సాగించారు.

ALSO READ | కర్ణాటకలో వింత ఘటన: తప్పిపోయిన కుక్క 250 కి.మీలు నడిచి ఇంటికి వచ్చింది..!

ఎట్టకేలకు ఒక గుహలో ఆమె కనిపించింది. తప్పిపోయిన కూతురు కనిపించిందని సంతోషపడే లోపే ఆమె ప్రవర్తన చూసి కుటుంబ సభ్యులు చింతించారు. గుహలో అర్థనగ్న స్థితిలో ఉన్న ఆమె పాములా బుసలు కొడుతూ కనిపించింది. నాగిని సీరియల్ నటి మాదిరిగా పాము పడగలా చేతులు రెండూ కలిపి ఉంచి నాలుకతో బుసలు కొడుతూ ఉన్న ఆమెను చూసి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఆమెకు ఏం జరిగిందో, ఎందుకలా అయిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ.. ఆమె ఏం మాట్లాడటం లేదు. మూడు నెలల పాటు ఆ గుహలో ఎలా ఉందో, నీళ్లుతిండి లేకుండా ఎలా మనుగడ సాగించగలిగిందో తెలియదు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by purvanchal (@purvanchal51)

పాములా ఆమె ప్రవర్తించడం చూసి నాగదేవత పూనిందని.. స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెకు పూజ చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు జోకులేస్తుంటే, మరికొందరు మాత్రం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన సావన్ నెల అని.. అందుకే ఆ యువతిని నాగ దేవత ఆవహించిందని.. వీడియో కింద ఓం నమ: శివాయ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివి ఇండియాలోనే చూడగలం అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘నాగిని’ తర్వాత సీజన్ జార్ఖండ్ లో షూట్ చేసే అవకాశం ఉందని ఒక నెటిజన్ జోక్ చేశాడు. మరికొందరు మాత్రం.. ఆ యువతి మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే అలా ప్రవర్తిస్తోందని.. ఆమెకు వైద్య చికిత్స అవసరం అని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు ఆమెకు చికిత్స చేయిస్తే అంతా సర్దుకుంటుందని చెబుతున్నారు. నెట్టింట రోజుకు కొన్ని వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ.. ఈ వీడియో అన్నింటి కంటే పూర్తి భిన్నంగా ఉంది. అందుకే.. నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వార్తల్లో నిలిచింది.